రెట్టింపైన హెచ్‌1బీ, ఎల్‌1 వీసా ఫీజులు


ఇండియా అభ్యంతరాలను బుట్టదాఖలు చేస్తూ అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటులో దిగువ సభ) హెచ్‌1వీ వీసాలు, ఎల్‌1 వీసాలపై అదనపు ఫీజుల భారం మోపడానికి నిర్ణయించింది. తాజాగా కాంగ్రెస్‌ ఆమోదించిన ప్రతిపాదన ప్రకారం హెచ్‌1బీ వీసాలపై ఫీజులు రూ. 2,64,000 (4000 డాలర్లు), ఎల్‌1 వీసాలపై రూ. 2,97,000 (4500 డాలర్లు) వసూలు చేస్తారు. ఈ విధంగా లభించే ఆదాయం దాదాపు సెప్టెంబర్‌ 11 నాటి దుర్ఘటనలో గాయపడిన వారి వైద్య ఖర్చులకు, అలాంటి వారిని గుర్తించేందుకు సిద్ధం చేస్తున్న బయోమెట్రిక్‌ వ్యవస్థ (9/11 బాధితుల హెల్త్‌ కేర్‌, చట్టం అమలుకు, బయో మెట్రిక్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌) ఏర్పాటుకు వినియోగించాలని కాంగ్రెస్‌ సభ్యులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు, సెప్టెంబర్‌ 11 నాటి బాధితుల ఆరోగ్య సంరక్షణ బిల్లుకు ఆమోదం తెలియజేయవలసి ఉంది. వీటి అమలుకు దాదాపు 1.1 ట్రిలియన్‌ల డాలర్లు (మన కరెన్సీ ప్రకారం కోటీ పది లక్షల కోట్లు) ఖర్చవుతుంది. అంచనా వేసిన ఈ మొత్తం సమకూరిన తరువాత వచ్చే పై ఆదాయాన్ని అమెరికా ఖజానాకు మళ్లిస్తారు.
కాంగ్రెస్‌ ఆమోదించిన తీర్మానం భారత దేశానికి చెందిన ఐటీ కంపెనీలపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ విషయమై   అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన టెలిఫోన్‌ సంభాషణల్లో ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్‌ ప్రతిపాదన వల్ల ఇండియాకు ఎదురయ్యే ఇబ్బందులను మోడీ వివరించారు. ఇటీవల సెప్టెంబర్‌లో భారత దేశంలోని ఐటీ రంగ వాణిజ్య  సంస్థ నాస్కామ్‌ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం ఈ దేశం నుంచి ఏటా 70 మిలియన్ల నుంచి 80 మిలియన్ల డాలర్ల వరకు (రూ. 46కోట్ల 20 లక్షల నుంచి రూ. 52 కోట్ల 80 లక్షల వరకు) అమెరికా ఖజానాకు ఆదాయం వస్తోంది. తాజా పెంపుతో దశాబ్ద కాలంలో 1.4 బిలియన్ల నుంచి 1.6 బిలియన్‌ డాలర్ల వరకు (రూ. 140 కోట్ల నుంచి రూ. 160 కోట్ల వరకు) అమెరికా ఖజానాకు ఆదాయం చేకూరుతుంది.

బిల్లులో ప్రత్యేకంగా భారతీయుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, దాని రూపకల్పన తీరు ప్రధానంగా వారిపైనే అధికంగా ఉంటుంది. అమెరికాలోని ఏ కంపెనీలోనైనా,  కనీసం 50 మంది ఉద్యోగులలో సగం మంది ఇలాంటి వీసాలపై వచ్చిన వాళ్లైతే వాళ్లకి ఈ కొత్త వీసా ఫీజు భారం పడుతుంది. ఇది తాత్కాలికమే అని చెబుతున్నా,  కనీసం పదేండ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. గతంలో అయిదేండ్లకే ఫీజులను వర్తింపచేసేవారు. ఇంతకుముందు 2010లో పెంపు గడువు 2015 సెప్టెంబర్‌తో ముగిసింది.


Post a Comment

0 Comments