ఇండోనేషియాలో బస్సు, రైలు ఢీ : 13 మంది మృతి

         ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో రైల్వే గేటు వద్ద ఓ మినీ బస్సు సిగ్నల్‌ చూసుకోకుండా పట్టాలు దాటుతుండగా వేగంగా వస్తున్న రైలు ఢీకొని ఏకంగా 400 మీటర్ల మేర బస్సును ఈడ్చుకెళ్లింది. దీంతో దాదాపు 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలని స్థానిక సిప్టో మగున్‌కుసమో ఆస్పత్రికి తరలించారు.

Post a Comment

0 Comments