13 ఏండ్ల బాలికపై బంధువు అత్యాచారం

                13 ఏండ్ల మైనర్‌ బాలిక తన బంధువు చేతిలో అత్యాచారానికి గురైన సంఘటన ఒడిషాలో జరిగింది. జాజుపూర్‌ జిల్లా ధన్‌మండల్‌ గ్రామానికి చెందిన దుష్మంత్‌ సాహు(25) అనే వ్యక్తి గత బుధవారం నాగ్వన్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఆ కుటుంబానికి చెందిన బాలిక బహిర్భూమికి వెళ్లగా, ఆమెను అనుసరించిన సాహు అక్కడే పొదలమాటుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను పొరుగువారు గుర్తించి కుటుంబానికి తెలియజేశారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం స్పృహలోకి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు శనివారం సాహును అరెస్ట్‌ చేశారు. 

Post a Comment

0 Comments