అండర్‌17 ఫిఫా వరల్డ్‌ కప్‌ కోసం భారత్‌ ఎదురుచూస్తోంది  • కేరళ బ్లాస్టర్స్‌ సహ యజమాని సచిన్‌ టెండూల్కర్‌ 

          ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ విజయంవంతమవడంతో కేరళ బ్లాస్టర్స్‌ సహ యజమాని సచిన్‌ టెండూల్కర్‌ అండర్‌17 ఫిఫా వరల్డ్‌కప్‌పై స్పందించారు. 'భారత్‌లో ఇప్పటికే ఐఎస్‌ఎల్‌ విజయవంతమైంది. ఇక ఇక్కడ అండర్‌17 ఫిఫా వరల్డ్‌కప్‌ కోసం చాలా మంది అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఇది భారత ఆటగాళ్లతో పాటు అభిమానులకు కూడా చాలా మంచి విషయం' అని వెల్లడించారు. దీంతో పాటు సచిన్‌ ఐఎస్‌ఎల్‌పై కూడా వ్యాఖ్యానించారు. 'ఐఎస్‌ఎల్‌ వల్ల భారత్‌లో ఫుట్‌బాల్‌కు అభిమానుల సంఖ్య పెరిగింది. అయితే ఒక ఆటతో ఇంకో దానిని పోల్చలేం. అన్నింటినీ గౌరవించాలి. ఆటగాళ్ల కృషి, నైపుణ్యాలను అభినందించాలి. ఈ విషయంలో భారత క్రీడాభిమానులను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. వారు ఐఎస్‌ఎల్‌ను ఆదరించడమే కాకుండా ఇతర దేశాల ఆటగాళ్లతో పాటు స్వదేశీ ఆటగాళ్లకు కూడా అభిమానులుగా మారుతున్నారు. భారత్‌ లాంటి పెద్ద దేశంలో ఇలా ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరగడం విశ్వక్రీడకు సానుకూలాంశం' అని ఆయన వెల్లడించారు.

Post a Comment

0 Comments