ఆ ఉగ్ర జంట చేసిన అప్పు రూ. 19లక్షలు

               అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పులు జరిపి 14 మందిని హతమార్చిన ఉగ్రవాద జంట ఆ ఘటనకు ముందు రూ. 28 వేల డాలర్ల (సుమారు 19 లక్షలు) అప్పుగా తీసుకున్నారు. ఈ విషయం ఎఫ్‌బీఐ ( ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేసన్‌) విచారణలో వెల్లడయ్యిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ ఉగ్రవాది సయ్యద్‌ రిజ్వాన్‌ ఫరూక్‌ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని 'పీర్‌ టు ఫీర్‌' అనే సంస్థ నుంచి ఆ మొత్తాన్ని రుణంగా పొందాడని చెప్పాయి. దీంతో దర్యాప్తు సంస్థ ఈ విషయంపై కూడా దృష్టి సారించిందని తెలిపాయి. ఇదిలా ఉండగా అమెరికాకి వలస వచ్చిన పాకిస్థానీయులైన సయ్యద్‌ రిజ్వాన్‌ ఫరూక్‌, పాకిస్థానీ యువతి అయిన తాష్వీన్‌ మాలిక్‌ను వివాహమాడాడు. ఈ జంట ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులై ఇలా కాల్పులకు తెగబడ్డారని, ఇది ఉగ్ర చర్యేనని ఎఫ్‌బీఐ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియా ఘటన అనంతరం ఈ ఉగ్రదంపతులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు.Post a Comment

0 Comments