ఏడాదంతా 4జీ.. ఫ్రీ.. ఫ్రీ... ఫ్రీ.

        
 
         చౌక మొబైల్‌ హ్యాండ్‌ సెంట్ల తయారీ సంస్థ డేటావిండ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 4జీ మొబైల్‌ని విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈవో సునీత్‌ సింగ్‌ తులి ప్రకటించారు. అయితే ఇందులో విశేషం ఏంటి అంటారా ! విశేషం ఉంది దీని ధర కేవలం రూ. 3వేలు, అంతేకాదు ఇది 12నెలలు పాటు అపరిమిత 4జీ ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ మీ సొంతం. ఇప్పటికే రిలయన్స్‌, టెలినార్‌ సంస్ధలతో కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉందని ,మరికొన్ని టెలికాం ఆపరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. నెట్‌ బ్రౌజింగ్‌ మాత్రేమే అపరిమితమని ఎలాంటి డౌన్‌లోడ్‌లు చేసుకునే అవకాశం లేదని సునీత్‌ సింగ్‌ తులి తెలిపారు. ఎవరైన ఏ వైబ్‌సైట్‌నైనా ఉచితంగా బ్రౌజింగ్‌ చేసుకునే అవకాశం ఉందని సునీత్‌ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments