ప్రయివేటుకు 400 రైల్వే స్టేషన్లు
  • రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభూ

             రైల్వే స్టేషన్ల ప్రయివేటీ కరణకు మోడీ సర్కార్‌ తెరలేపుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) పేరుతో వీటిని ప్రయివేటు కంపెనీలకు అప్పజెప్పడానికి కసరత్తు జరుగుతోంది. అభివృద్ధి పేరుతో దేశంలోని 400 రైల్వే స్టేషన్లకు ప్రయివేటు రంగ పెట్టుబడులను అహ్వానించనున్నా మని రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభూ స్పష్టం చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పిపిపి ప్రాజెక్టు కానుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంత మొత్తం పెట్టుబడులను అహ్వానించేది మంత్రి వెల్లడించలేదు. ఒక్కో స్టేషన్‌కు రూ.100 కోట్ల చొప్పున వ్యయం చేయనున్నారని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. న్యూఢిల్లీలో సిఐఐ పిపిపి సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రైల్వేలు కేవలం టికెట్‌ రెవెన్యూపై మాత్రం కొనసాగుతున్నాయన్నారు.

Post a Comment

0 Comments