కాందహార్‌ కాల్పుల్లో 46కు చేరిన మృతులు


       అప్ఘానిస్తాన్‌లోని కాందహార్‌ విమానాశ్రయం వద్ద తాలిబన్లు, ఆ దేశ సైనికులకూ మధ్య జరిగిన కాల్పుల్లో
మృతుల సంఖ్య 46కు చేరింది. మృతుల్లో 9 మంది ఉగ్రవాదులు, నలుగురు సైనికులు కాగా, మిగతావారు పౌరులు.
చనిపోయినవారిలో ఎక్కువ భాగం మహిళలు, చిన్నారులు. మరో 30 మంది వరకూ గాయపడ్డారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే నాటో-అప్ఘాన్‌ మిలిటరీ దళాల హెడ్‌క్వార్టర్స్‌ ఉన్నాయి. మొదట తాలిబన్లు కాల్పులు ప్రారంభించగా ప్రభుత్వ దళాలు ఎదురు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి మొదలైన కాల్పులు బుధవారం తెల్లవారుజాము వరకూ కొనసాగాయి. 11 మంది ఉగ్రవాదులు దాడులకు తెగబడగా 9 మంది ఎదురు కాల్పుల్లో చనిపోయారని, మిగతా ఇద్దరూ పారిపోయినట్టు అధికారులు తెలిపారు.Post a Comment

0 Comments