వరదల్లో పొగొట్టుకున్న వారికి ఉచితంగా పాస్‌పోర్టు  • సుష్మాస్వరాజ్‌

             చెన్నై వరదల్లో పాస్‌పోర్టు కోల్పోయిన వారికి ఉచితంగా మరోపాస్‌పోర్టు అందజేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ హామీ ఇచ్చారు.ఈ మేరకు ఆమె సోమవారం ట్వీట్‌ చేశారు.తమిళనాడు వరదల్లో పాస్‌పోర్టు పొగొట్టుకున్న వారికందరికీ ఉచితంగా పాస్‌పోర్టు అందజేయాలని తన శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. తమిళనాడు వాసులు  తమకు సమీపంలోని పాస్‌పోర్టు కార్యాలయాలకు వెళ్లాలని కోరారు. పాస్‌పోర్టు కోల్పోయినవారు. పాక్షికంగా పాస్‌పోర్టు దెబ్బతిన్న వారు కొత్త పాస్‌పోర్టు పొందవచ్చని సూచించారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌కు పాస్‌పోర్టు సమస్యలను పరిష్కరించే బాధ్యతను అప్పగించినట్టు ఆమె పేర్కొన్నారు. బాధితులు ఆయనను సంప్రదించాలని కేంద్ర మంత్రి సూచించారు.


Post a Comment

0 Comments