ఐఎస్‌ ఆర్థికమంత్రి 'అబూ సలేహ్‌' హతం  • అమెరికా బలగాల కాల్పులు

      అమెరికా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐఎస్‌ ఆర్థికమంత్రి అబూ సలేహ్‌ (42) హతమయ్యాడని శుక్రవారం అమెరికా మిలిటరీ అధికార ప్రతినిధి స్టీవ్‌వారెన్‌ ధృవీకరించారు.  అబూ సలేహ్‌  ఐఎస్‌ ఆర్థికవ్యవహారాలను పర్యవేక్షించేవారని పేర్కొన్నారు.  గత నెల అమెరికా సంకీర్ణ దళాలు ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టి  అతడ్ని మట్టుబెట్టాయన్నారు. ఈ దాడుల్లో  అబూతో పాటు మరో ఇద్దరు ఐఎస్‌ నేతులు కూడా హతమయ్యారని స్టీవ్‌ తెలిపారు. అబూ సలేహ్‌ అసలు పేరు మువాఫాఖ్‌ ముస్తాఫా ముహమ్మద్‌ అల్‌ కర్ముశ్‌.  ఇరాన్‌కు చెందిన అబూ...ఐఎస్‌ ఆర్థిక కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షించి కీలక నేతగా ఎదిగారు. సిరియాలో  ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రత్యేక బలగాలను మోహరించి ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరుపుతున్నామని అమెరికా రాయబారి బ్రెట్‌ మెక్‌గర్క్‌ పేర్కొన్నారు.  


Post a Comment

0 Comments