గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక పరిపాలన నిర్వహణ విభాగం


గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక పరిపాలన నిర్హహణ విభాగం ఏర్పాటు కానుంది. శానిటేషన్‌, సెక్యూరిటీ, ఎలక్ట్రికల్‌ పరికరాలు, ఇతత్రాలను ఈ విభాగంలో చేర్చారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలోని అన్ని విభాగాలు సూపరింటెండెంట్‌ పరిధిలోనే కొనసాగుతున్నాయి. అయితే రోగులకు కల్పిస్తున్న సేవల్లో ఇబ్బందులు తలెత్తుతుండటంతో సూపరింటెండెంట్‌ను మెడికల్‌ విభాగానికే పరిమితం చేశారు. పరిపాలన నిర్వహణ, మెడికల్‌ విభాగాలు సమన్వయంతో పనిచేసి రోగులకు మెరుగైన సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే పరిపాలన నిర్వహణ విభాగంలోనూ కొన్ని సందర్భాల్లో సూపరింటెండెంట్‌కే అధికారులు కట్టబెట్టారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌తివారీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రి పరిపాలనకు నిర్వహణ విభాగంలో ఈ పోస్టులు మంజూరు చేశారు. జనరల్‌ మేనేజర్‌  పరిపాలన విభాగం (నిర్వహణా విభాగాలన్ని కలిపి), అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ా  పరిపాలన విభాగం (వైద్య పరికరాల పర్యవేక్షణ), అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌  పరిపాలన విభాగం (సివిల్‌, ఎలక్ట్రికల్‌, శానిటేషన్‌, సెక్యూరిటీ సర్వీసెస్‌ పర్యవేక్షణ), అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌), అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (బయో మెడికల్‌ ) పోస్టులను మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.          


Post a Comment

0 Comments