'డెస్మెండ్‌' ప్రభావిత ప్రాంతాల్లో బ్రిటన్‌ ప్రధాని పర్యటన


 
           ఉత్తర ఇంగ్లాండ్‌లో వరద ప్రభావిత  ప్రాంతాల్లో సోమవరాం బ్రిటన్‌ ప్రధాన మంత్రి డెవిడ్‌ కెమోరాన్‌ పర్యటించారు. కార్‌లిస్లీలో సహాయ చర్యలు చేపడుతున్న బృందాలను కలిశారు. వరద ప్రభావిత ప్రాంతాల గురించి అధికారులతో సమావేమై పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన అన్ని సుదపాయాలను అందించాలని సూచించారు. ఉత్తర ఇంగ్లాండ్‌లో రెండు రోజుల క్రితం డెస్మండ్‌ తుపాను అల్లకల్లోలం సృషించింది. వరదల కారణంగా దాదాపు 45 వేల మంది ప్రజల ఆవాసాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వరదల్లో ఇద్దరు మృతి చెందగా వందలాది  ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Post a Comment

0 Comments