కేజ్రీవాల్‌తో అఖిలేష్‌ భేటీ


    ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ భేటీ అయ్యారు. ఢిల్లీలో ఉత్తరప్రదేశ్‌ సదన్‌లో శుక్రవారం వీరిద్దరి సమావేశం జరిగింది. ఓఖ్లా గ్రామ అంశంతోపాటు, పర్యావరణానికి సంబంధించిన పలు విషయాలు వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు 45 నిమిషాలపాటు చర్చించుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఓఖ్లా గ్రామానికి చెందిన అంశం చాలా కాలం నుంచి వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. 214 బీఘాల భూమిపై హక్కు ఎవరిదన్న విషయం తేలకుండా ఉంది. వివాదాస్పదంగా ఉన్న ఆ భూమిని ఢిల్లీ ప్రభుత్వం సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు ఇటీవల వార్తలచ్చాయి.  జామై మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విస్తరణకు ఆ భూమిని వినియోగించాలని కేజ్రీవాల్‌ సర్కార్‌ భావిస్తోంది. ఈ అంశంతోపాటు దాద్రీలో నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు అంశంపై కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.

Post a Comment

0 Comments