లైంగికదాడి నిందితుడికి చెప్పుదెబ్బలు


ఉత్తరప్రదేశ్‌లో కాప్‌ పంచాయితీల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సామూహిక అత్యాచార ఘటన పోలీసు దృష్టికి వెళ్ళకుండా, వారికి జరిమానా విధించి చేతులు దులుపుకోవాలనుకుంది ఆ గ్రామ పంచాయితి. అత్యా చారానికి పాల్పడిన నిందితుడిని గ్రామస్థుల సమక్షంలో చెప్పు తో కొట్టాలని బాధితురాలిని పంచాయితీ ఆదేశించింది. 
అంతేకాదు, ముఖంపై సిరా పోసి తన నిరసనను తెలియజేయాలని చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని హావూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోడల్‌పూర్‌ గ్రామంలో డిసెంబరు 19న ఓ యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ విషయంపై విచారణ జరిపిన పంచాయితీ, నిందితులకు రూ. 5 లక్షల జరి మానాను విధించింది.  అయితే నిందితుల్లో ఒకతను తాను జరి మానా కట్టేందుకు ససేమిరా అన్నాడు. దీంతో పంచాయితీ పెద్దలు బాదితురాలని అతడి ముఖంపై ఇంకుపూమని, చెప్పుతో కొట్టమని ఆదేశించారు.  ఈ ఘటనపై స్థానిక మీడి యాలో వార్తలు రావడంతో అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అత్యాచార ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పంచాయితీ తీర్పుతో సంబంధం లేకుండా తాము విచారణ కొనసాగిస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0 Comments