పోలీసుల అదుపులో సినీ 'తారా'


   సినీ నటి, ప్రముఖ టీవీ యాంకర్‌ తారా చౌదరిని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని ప్రశాంతి నగర్‌లో ఉంటున్న ఆమె అన్న శ్రీనివాస్‌, వదిన కవితలపై గురువారం రాత్రి దౌర్జన్యానికి దిగిందనే ఆరోపణనలు వచ్చాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ దంపతులిద్దరినీ దుర్భాషలాడటమే కాకుండా దాడి చేసి, వారిని హైదరాబాద్‌కు రమ్మని ఒత్తిడి తెచ్చింది. వారు సుముఖంగా లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది. మళ్లీ శుక్రవారం ఉదయం మరోసారి వాళ్లింటికి చేరుకున్న తారా చౌదరి  మరోసారి దౌర్జన్యానికి దిగింది. చుట్టుపక్కల వారు 100 నెంబర్‌ ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. నున్న స్టేషన్‌ నుంచి పోలీసులు వచ్చి ఆమెకు నచ్చజెప్పే యత్నం చేశారు. పోలీసులపై కూడా ఎదురు దాడికి దిగింది. ఈ ఘటనలో జ్యోతి అనే మహిళా కానిస్టేబుల్‌కు  గాయాలయ్యాయి. తారా చౌదరిపై కానిస్టేబుల్‌ జ్యోతితో పాటు ఆమె వదిన కవిత కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

0 Comments