జంతు కళేబరాలతో నూనె తయారీ
  • ముఠా సభ్యుల అరెస్ట్‌
  • 15 డ్రమ్ములు, డిసిఎం స్వాధీనం

            జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎమ్‌డి.నజీర్‌ కల్తీ నూనె తయారు చేసేందుకు మూడు నెలల కిందట మేడికుంటపల్లి గ్రామానికి చెందిన కొండల్‌రెడ్డి భూమిని లీజుకు తీసుకున్నాడు. రేకుల షెడ్డు వేసి అక్కడ జంతు కళేబరాలతో 15 రోజుల నుండి నూనె తయారీ ప్రారంభించారు. మూడు రోజులుగా గ్రామంలోకి దుర్వాసన వస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. గురువారం అర్ధరాత్రి ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తన సిబ్బందితో దాడులు నిర్వహించి నూనె తయారీదారులను అరెస్టు చేశారు. అక్కడున్న వారు శుక్రవారం ూదయం 3 గంటలకు లోడు వస్తుందని తెలపడంతో ఎస్‌ఐ డిసిఎంను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ పరార్‌ అయ్యాడు. ప్లాంటును సీజ్‌ చేశారు. తయారీదారులు ఎస్‌కె.హఫీజ్‌ఖాన్‌, మోదిన్‌, ఎమ్‌డి.సలీమ్‌, ఎమ్‌డి.అలీమ్‌, భీమ్‌తోపాటు నిర్వాహకుడు ఎమ్‌డి.నజీర్‌, రైతు కొండల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 269, 278, 290, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


Post a Comment

0 Comments