టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జైలుకు...  • పటాన్‌చెరు ఎమ్మెల్యేకు రెండున్నరేండ్ల జైలు..
  •  రెండు వేల జరిమానా
  •  వర్సాటైల్స్‌ పరిశ్రమ వ్యవహారం

   తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి సంగారెడ్డి అడిషనల్‌ మున్సిఫ్‌ కోర్టు రెరడున్నరేండ్ల  జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు గురువారం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు అనంతరం ఎమ్మెల్యే బెయిల్‌ తీసుకున్నారు. 2014లో మహిపాల్‌రెడ్డిపై 448, 323, 386, 342 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే... వర్సాటైల్స్‌ పరిశ్రమలో పని చేస్తున్న చిట్కుల్‌కు చెందిన మహేష్‌ 2014 మే 4న పటాన్‌చెరు మండలం లక్డారం శివారులోని క్వారీలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.  మహిపాల్‌రెడ్డి పరిశ్రమ వద్దకు చేరుకుని పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి కుటుంబానికి పరిహారం కింద రూ.15 లక్షల చెక్కు ఇప్పించారు. అయితే పరిహారం ఇప్పించే క్రమంలో కంపెనీ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బెదిరించారని ఆ కంపెనీ నిర్వాహకులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కోర్టు ఎమ్మెల్యేకు శిక్ష ఖరారు చేసింది. తప్పుడు ఆరోపణలతో నమోదైన కేసు తీర్పుపై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చెప్పారు.


Post a Comment

0 Comments