నగిషీ కళకు పట్టం  • తెలంగాణ వాసి వెంకటేశ్వర్లుకు జాతీయ అవార్డు 

             నగిషీ కళలో అద్భుత కళా ఖండాల సృష్టికిగాను కళాకారుడు రంగో వెంకటేశ్వర్లు బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో  2012-14 సంవత్సరాలకు సంబంధించి జాతీయ, శిల్పి గురు అవార్డుల ప్రదా నోత్సవ కార్యక్రమంలో జౌళిశాఖ మంత్రి సంతోష్‌కమార్‌ గంగ్వార్‌, ఆ శాఖ కార్యదర్శి ఎస్‌ కె పాండ సమక్షంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా వెంకటేశ్వర్లు ఈ అవార్డు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ విభాగంలో అవార్డు పొందడం ఇదే ప్రథమం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1979లో నగిషీ విభాగంలో ఈ అవార్డును ఆయన గురువు ఐలాచారి అందుకున్నారు. 2013-14 సంవత్సరానికి గాను ఇత్తడిరేకుల మీద కళాఖండాలు తయారు చేసే విభాగంలో వెంకటేశ్వర్లకు ఈ అవార్డు వరించింది. ఆయన రూపొందించిన కల్పద్రుమ అనే కళాఖండం ఆయనకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది. ఈయన జన్మించింది పెంబర్తిలో అయినప్పటికీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కవాడీగూడలో నివాసం ఉంటున్నారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు.Post a Comment

0 Comments