సామూహిక లైంగిక దాడి కేసు.. .ఏడుగురు దోషులకు మరణశిక్ష


 నేపాల్‌ యువతిపై సామూహిక లైంగిక దాడి, హత్య కేసులో ఏడుగురు దోషులకు మరణశిక్ష విధిస్తూ సోమవారం కోర్టు తీర్పునిచ్చింది. వారిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు బాలరేపిస్టు కావటం గమనార్హం. న్యాయమూర్తి జస్టిస్‌ సీమా సింఘాల్‌ పదినెలల్లోనే సామూహిక లైంగికదాడి కేసులో తీర్పునిచ్చారు. నేపాల్‌ దేశానికి చెందిన యువతి మూడేండ్లుగా మానసికంగా బాధపడుతోంది. వైద్యం నిమిత్తం సోదరితో కలిసి ఆమె రోహతక్‌కు వచ్చింది. అయితే ఫిబ్రవరిలో ఆ యువతి అదృశ్యమైంది. ఆ తర్వాత  అక్బర్‌పూర్‌లోని వ్యవసాయ భూమిలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమెపై సామూహిక లైంగికదాడి చేసి, హత్య చేశారని పోస్టుమార్టంలో తేలింది. గుర్తుతెలియని దుండగులు ఇందుకు పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చివరికి దోషులు పట్టుబడ్డారు. ఈ మేరకు కోర్టు శిక్ష విధించింది.
Post a Comment

0 Comments