సల్మాన్‌పై కేసులన్నీ కొట్టేసిన బాంబే హైకోర్టు

  • మద్యం తాగి కారు నడిపినట్టు రుజువు కాలేదని వ్యాఖ్యానించిన న్యాయస్థానం
  • కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్‌ నటుడు

            బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌పై 2002లో నమోదైన కేసులన్నింటినీ బాంబే హైకోర్టు గురువారం కొట్టేసింది. దీంతో నిర్దోషిగా ఆయన బయట పడ్డారు. సల్మాన్‌ మద్యం తాగి కారు నడిపినట్టు రుజువు కాలేదని కోర్టు పేర్కొంది.సల్మాన్‌ తాగి డ్రైవ్‌ చేసినట్టు నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని జస్టిస్‌ ఏఆర్‌ జోషి అభిప్రాయపడ్డారు.2002 సంవత్సరంలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సెషన్స్‌ కోర్టు తీర్పుపై సల్మాన్‌ఖాన్‌ అప్పీలు చేసుకున్న నేపథ్యంలో బాంబే హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది.ముఖ్యంగా బార్‌ బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్‌ నిర్దోషి అని కోర్టు ప్రకటించిన వెంటనే సల్మాన్‌ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన దు:ఖాన్ని ఆపుకోలేక పోయారు. ఆయన సోదరి అల్విరా కోర్టు హాలులోనే ఉన్నారు.ముఖ్యంగా బార్‌ బిల్లును ప్రవేశ పెట్టడంలో ప్రాసికూషన్‌ విఫలమైందని హైకోర్టు పేర్కొంది. ముంబయిలోని బాంద్రాలో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 5గురు కూలీలపై తన కారు నడిపారనే ఆరోపణలను సల్మాన్‌ ఎదుర్కొన్నారు. 2002 సంవత్సరం సెప్టెంబర్‌ 28న జరిగిన ఈ సంఘటనలో ఒక కూలీ మరణించారు. 4గురు గాయపడ్డారు. ఈ కేసులో సల్మాన్‌కు ముంబయి సెషన్స్‌ కోర్టు 5 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ, ఈ సంవత్సరం మే6న తీర్పు వెలువరించింది. అదే రోజు సల్మాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సెషన్స్‌ కోర్టు తీర్పుపై ఆయన బాంబే హైకోర్టులో అప్పీలు చేశారు. విచారణ అనంతరం హైకోర్టు గురువారం ఈ తీర్పును వెలువరించింది. సల్మాన్‌ ఖాన్‌పై ఈ కేసు విచారణ 13 సంవత్సరాల పాటు కొనసాగింది.


Post a Comment

0 Comments