- మాంట్రియల్‌కి మళ్లింపు
ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెది రింపు రావడంతో పారిస్ వెళ్లాల్సిన విమానాన్ని మాంట్రియల్‌కి మళ్లిం చారు. బోయింగ్ 777 విమానం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శాన్ప్రాన్సిస్కో నుంచి పారిస్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో విమానంలో బాంబు ఉన్నట్లు అగంతకులు నుంచి బెదిరిపు ఫోన్ రావడంతో మంగళవారం ఉయదం విమానాన్ని కెనడాలోని మాంట్రియల్లో పియరే ఎలియట్ ట్రోడో అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అధికారులు ప్రయాణికులని దించివేసి విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విమానంలో మొత్తం 231 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను గమ్యం చేర్చడానికి ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని దింపామని సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
0 Comments