త్వరలో ఢిల్లీలో మహిళా పోలీస్‌ పెట్రోలింగ్‌..!

           
                త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో మహిళా పోలీసులతో పెట్రోలింగ్‌ నిర్వహించనున్నట్టు డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌(పిసిఆర్‌) ఆర్‌కె సింగ్‌ తెలిపారు. పెట్రోలింగ్‌ వాహనాల్ని నడిపేందుకు ఇప్పటికే 8 మంది మహిళా డ్రైవర్లను ఎంపిక చేసినట్టు ఆయన వెల్లడించారు. పూర్తిగా మహిళా కానిస్టేబుళ్లతోనే పెట్రోలింగ్‌ వాహనాల్ని నడిపేందుకు పైలట్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టామని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ 240 మంది మహిళా పోలీసులు పెట్రోలింగ్‌ యూనిట్‌లో పని చేస్తుండగా, వారిలో 160 మంది కొత్తగా నియమితులైనవారే. ఇక నుంచి మహిళా కానిస్టేబుళ్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కచ్చితంగా ఉండాలని నిబంధన విధిస్తున్నట్టు ఢిల్లీ పోలీస్‌ విభాగం తెలిపింది.

            పూర్తిగా మహిళలతో కూడిన పోలీస్‌ పెట్రోలింగ్‌ను వచ్చే నెల(జనవరీ2016)లో ఇండియా గేట్‌, వసంత్‌ కుంజ్‌ జోన్లలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మిగతా జోన్లకు విస్తరించనున్నారు. మహిళలపై వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌, అత్యాచార యత్నంవంటి ఘటనల్ని నివారించేందుకు మహిళా పోలీస్‌ పెట్రోలింగ్‌ను వినియోగించనున్నారు.
Post a Comment

0 Comments