అత్యాచారం కేసులో వందేండ్లు జైలు


మలేసియాలో 13 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన   కేసులో ఉన్నత స్థాయి పోలీస్‌ అధికారికి కఠిన శిక్ష విధించారు. ఈ కేసులో దోషిగా తేలిన డిప్యూటీ సూపరింటెండెంట్‌ రొహైజత్‌ అబ్దుల్‌ అని (54) వందేండ్ల జైలు శిక్షతో పాటు 15 బెత్తం దెబ్బలు కొట్టాలని బుధవారం తీర్పు వెలువరించింది.  2012లో అబ్దుల్‌ బాధితురాలిని ఓ హోటల్‌లో రెండు రోజుల పాటు బంధించి నాలుగుసార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు కేసు నమోదైంది. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న అబ్దుల్‌  ప్రజలకు సంరక్షుడిగా ఉండాలే కాని, నేరస్తుడు కాదని కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. బాలిక వయసును కూడా దృష్టిలో ఉంచుకోకుండా కిరాతకంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. అబ్దుల్‌  నేరం చేసినట్టు రుజువు కావడంతో కోర్టు కఠిన శిక్షను విధించింది. ఆయన పైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశముంది.

Post a Comment

2 Comments

  1. అలాంటి వారికి ఇలాంటి శిక్షే 100% రైటూ
    ఇలాంటి శిక్షలు మనదేశంలో ఎందుకు వేయరు బాబూ
    కోరలు లేని చట్టాలెట్లా ఘోరా లాపును బాసూ

    ReplyDelete
  2. mana deshamlo kuda vastey hilanti gatanalu thagguthayi... kaani ma prajaswamyamlo konni marpulu raavaali... annagaaru

    ReplyDelete