ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రేసులో సైనా

           

            2015లో అద్భుత విజయాలు సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌.. ప్రతిష్టాత్మక 'ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' (వుమెన్స్‌) అవార్డుకు నామినేట్‌ అయ్యింది. ఆల్‌ఇంగ్లాండ్‌, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్స్‌కు చేరటం సహా రెండు మేజర్‌ టైటిల్స్‌ నెగ్గిన సైనా ఈ ఏడాది నెం.1 ర్యాంక్‌ సైతం దక్కించుకుంది. సీజన్‌లో నిలకడగా రాణించిన హైదరాబాదీ అమ్మాయి అవార్డు రేసులో నిలిచింది. కరొలినా మారిన్‌ (స్పెయిన్‌), యున్లీ, యుజిన్‌ (చైనా) అవార్డు కోసం సైనాతో పోటీపడుతున్నారు. మెన్స్‌ విభాగంలో చెన్‌ లాంగ్‌, జాంగ్‌ నాన్‌ (చైనా), లీ యోంగ్‌, సియోంగ్‌ (దక్షిణ కొరియా)లు అవార్డు రేసులో ఉన్నారు. ఈ ఏడాది తొలిసారి పారా అథ్లెట్లకు సైతం అవార్డులను ఇవ్వనున్నారు. వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ సందర్భంగా డిసెంబర్‌ 7న బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ అవార్డులను ప్రకటించనుంది. చెన్నై వరద సాయం నిమిత్తం సైనా నెహ్వాల్‌ శుక్రవారం రూ. 2 లక్షలు విరాళం ప్రకటించింది.


Post a Comment

0 Comments