కేసీఆర్‌, కేటీఆర్‌లకు నోటీసులు  • కేంద్ర ఎన్నికల సంఘం

           తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఈ మేరకు గురువారం నోటీసులు పంపింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది నేతలతో సమావేశమై హామీలు ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. అలాగే సచివాలయంలో మంత్రి కెేటీఆర్‌ కొందరు నేతలకు టీఆర్‌ఎస్‌ పార్టీ కండువాలు కప్పడాన్ని కూడా ఎన్నికల సంఘం తప్పుబట్టింది. దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఇరువురిని ఎన్నికల సంఘం ఆదేశించింది. కేసీఆర్‌, కేటీఆర్‌లపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌లపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.


Post a Comment

0 Comments