ఏజియన్ సముద్రంలోని ఓ గ్రీసు ద్వీపం వైపు వెళ్తున్న పడవ మంగళవారం ఉదయం మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. టర్కీలోని సెస్మే నుంచి బతుకు తెరువు వెదుక్కొంటూ వీరు బయలుదేరిన కొద్ది సేపటికే పడవ మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో ఎనిమిది మందిని తీర ప్రాంత భద్రతా సిబ్బంది రక్షించారు. అయితే పడవలో మొత్తం ఎంత మంది ఉన్నారన్న దానిపై వివరాలు తెలియరాలేదు. 2015లో ఇప్పటి వరకు దాదాపు 400,000 మంది శరణార్ధులు టర్కీ నుంచి అక్రమ మార్గాల్లో గ్రీస్‌కు చేరుకున్నారు. అందులో 300 మంది అత్యధికంగా సిరియా వాసులు. ఇలా పడవ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
0 Comments