తొలిస్థానంలో ఒబామా  • అగ్రనేతల జాబితాలో మోడీ @ 7

 ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రముఖ నేతల జాబితాల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మొదటిస్థానంలో నిలిచారు. బ్రిటన్‌కు చెందిన వోఆర్‌బీ ఇంటర్నేషనల్స్‌  సంస్థ ' ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ లీడర్స్‌' అంశంపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఒబామా మొదటిస్థానంలో నిలవగా...భారత ప్రధాని నరేంద్రమోడీ ఏడో స్థానంలో నిలిచారు. మొత్తం 65 దేశాల్లో ఈ సర్వే చేపట్టగా ప్రధాని మోడీకి అనుకూలంగా 24 శాతం మంది ప్రజలు ఓటు వేశారు. మరో 20 శాతం మంది మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. కాగా, ద్వితీయ స్థానంలో జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌, తృతీయ స్థానంలో బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌, నాలుగో స్థానంలో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలండే, తరువాతి స్థానాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, భారత ప్రధాని మోడీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్‌, సౌదీ అరేబియా రాజు సల్మాన్‌బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌, ఇరాన్‌ అధ్యక్షుడు హస్సన్‌ రౌహానీ నిలిచారు.


Post a Comment

0 Comments