మతోన్మాద రాజకీయాలు వద్దు  •  'ఆప్‌' నేత సోమనాధ్‌భారతీ

          మతోన్మాద రాజకీయాలు ప్రజల్లో విభజనను తెస్తాయని, ఆ తరహా రాజకీయం సమాజానికి మంచిది కాదని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) దక్షిణ భారతదేశ ఇంఛార్జ్‌ సోమనాధ్‌భారతీ అన్నారు. ఆప్‌ తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై, మాట్లాడారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అధికారపార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం సరికాదన్నారు. సెక్యులరిజాన్ని కాపాడాల్సిన పార్టీలు ఈ తరహా రాజకీయాలతో ప్రజల్ని ఎక్కువ కాలం మభ్యపెట్టలేవని చెప్పారు. భారతదేశంలో పుట్టుకతోనే ప్రతి బిడ్డ తలపై రూ.40వేల తలసరి అప్పు ూందని, ఈ దేశం అంత పేదదేం కాదని అన్నారు. అవినీతి మరకలే దేశాన్ని ఈ స్థితికి తెచ్చాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పీజీ టు కేజీ విద్య హామీపై ప్రభుత్వం ఇప్పటి వరకు నోరుమెదపట్లేదని అన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్ధులు ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్నారని, వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా విద్యాప్రమాణాలు ూండాలని చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేస్తామన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించే ప్రణాళికలు త్వరలో అమలు చేస్తామని చెప్పారు. ఆప్‌ రాష్ట్ర కన్వీనర్‌ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌ పక్కా అవినీతి ప్రాజెక్టులని ఆరోపించారు. నోటు-ఓటు కేసుపై మీడియాలో హల్‌చల్‌ చేసిన ప్రభుత్వం ఇప్పుడెందుకు మౌనం వహిస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ ప్రజలు సామాన్యులకు చట్టసభల్లో స్థానం కల్పించారని, ఆతరహా మార్పు తెలంగాణలో కూడా రావాలని ఆకాంక్షించారు. ఆప్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని తెలంగాణ కుటుంబ  సమితి ఏలుతుందని విమర్శించారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలపై సర్కార్‌ నోరుమెదపట్లేదని అన్నారు. రాష్ట్రంలో మతోన్మాదం, అవినీతిపైనే తమ పోరాటం ూంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడారు.

Post a Comment

0 Comments