లైబీరియా, గినియాలలో మళ్లీ ఎబోలా ప్రత్యక్షం            గత ఏడాది మొదట్లో ఆఫ్రికా దేశాలలో ప్రారంభమైన ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్‌ ఇప్పుడు తిరిగి లైబీరియాలో కన్పించినట్లు తెలుస్తోంది.  తీవ్రస్థాయిలో ఎబోలా దెబ్బతిన్న ఆఫ్రికాదేశాలో లైబీరియాదే మొదటి స్థానం అప్పట్లో ఈ వ్యాధి బారిన పడి ఈ ప్రాంతంలో దాదాపు 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.  ఎబోలా వైరల్‌ వ్యాధి లైబిరియాతో పాటు గినియా, సియెర్రాలియోన్‌ వంటి దేవాలను కూడా చుట్టుముట్టింది.  ఈ మూడు దేశాలూ గత మూడు దశాబ్దాలకు పైగా అంతర్గత ఘర్షణలు, అశాంతితో సతమతమయ్యాయి.
            గత నెలలో నాథన్‌ జెబోటో అనే యువకుడు ఎటువంటి జ్వరం వంటి లక్షణాలేమీ లేకుండానే నోటి నుండి రక్తం కక్కుకోవటంతో అతడిని తండ్రి వైద్యపరీక్షలకు  లైబీరియా రాజధాని మన్రోవియాలోని జాన్‌ఎఫ్‌ కెనడీ వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు.  అతడికి జరిపిన వైద్యపరీక్షల్లో ఎబోలా వైరస్‌ వెలుగు చూసింది.  వ్యాధి గుర్తింపులో జాప్యం జరగటంతో ఆ యువకుడు నవంబర్‌ 20న మరణించాడు. ఎబోలాను దేశం నుండి నిర్మూలించామన్న వైద్య నిపుణుల ధీమాను ఇతడి మరణం నిర్వీర్యం చేసింది.


Post a Comment

0 Comments