హైదరాబాద్‌ ఓటమి


క్వార్టర్స్‌లో జార్ఖండ్‌

       రాహుల్‌ శుక్లా (5/89) విజృంభించడంతో జార్ఖండ్‌ హైదరాబాద్‌పై పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 115/3తో చివరి రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ 269 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 27 పరుగుల విజయలక్ష్యాన్ని జార్ఖండ్‌ వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది. ఈ గెలుపుతో జార్ఖండ్‌ రంజీట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. చివరి రోజు హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో బాలచందర్‌ అనిరుధ్‌ (79 నాటౌట్‌, 136 బంతుల్లో 8 ఫోర్లు), భవనక సందీప్‌ (58, 161 బంతుల్లో 8 ఫోర్లు) మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. సుమంత్‌ (6), మిలింద్‌ (11), విశాల్‌ శర్మ (3), లలిత్‌ మోహన్‌ (12), రవి కిరణ్‌ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరగా 79 పరుగులు చేసిన అనిరుధ్‌ నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం 27 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని జార్ఖండ్‌ 3.4 ఓవర్లలో ఛేదించింది. ఆనంద్‌ సింగ్‌ (22), సౌరభ్‌ తివారి (6) నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులు చేయగా జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగులు చేసింది.


Post a Comment

0 Comments