డాన్యూబ్‌ నదిలో డబ్బుల కట్టలు!


         సాధారణంగా నదుల్లో సముద్రాల్లో నిధులు దొరుకుతుంటాయని వింటుంటాం. కానీ ఆస్ట్రియాలోని డాన్యూబ్‌ నదిలో మాత్రం డబ్బుల కట్టలు దొరికాయి. అదీ ఒకటీ రెండు కాదు అక్షరాల రూ.74 లక్షల నగదు నదిలో తేలుతూ కన్పించింది. డాన్యూబ్‌ నది వద్ద ఉన్న ఓ బాలుడికి ఈ  నోట్ల కట్టలు కన్పించాయి.  వెంటనే నదిలోకి దూకి వాటిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అతనికి ఈత రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. తీరా పోలీసులు అక్కడికి వచ్చి చూసేసరికి బాలుడు డబ్బును బయటికి తీసుకొస్తూ కన్పించాడు. అయితే ఈ డబ్బు కట్టలు నదిలో ఎలా కొట్టుకొచ్చాయో అక్కడివారికి అంతుపట్టలేదు. ప్రస్తుతం డబ్బును బయటికి తెచ్చిన బాలుడు తనకు కొంత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడు. సాధారణంగా ఆస్ట్రియాలో ఎవరికైనా డబ్బు దొరికితే అందులో 5 నుంచి 10 శాతాం వాటా ఇస్తారు.  ఒక వేల ఆ డబ్బు యజమాని వివరాలు ఏడాది గడిచినా తెలీకపోతే  పూర్తి  మొత్తాన్ని తెచ్చిన వారికి అప్పగిస్తారు.Post a Comment

0 Comments