ఉత్తర ఇరాక్‌ నుంచి మీ బలగాల్ని ఉపసంహరించండి


  • టర్కీని కోరిన ఇరాక్‌ విదేశాంగ శాఖ 

          ఉత్తర ఇరాక్‌లో మోహరించిన తన బలగాలన్ని టర్కీ ఉపసంహరించుకోవాలని ఇరాక్‌ డిమాండ్‌ చేసింది. సరిహద్దు దేశంతో గల సంబంధాల పట్ల గౌరవముంటే టర్కీ తమ బలగాలని వెనక్కి తీసుకోవాలని ఇరాక్‌ కోరింది.  ఇందుకు సంబంధించి టర్కీ రాయబారిని పిలిపించి ఇరాక్‌ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. టర్కీ సైనిక దళాలు ఇరాక్‌ ప్రభుత్వ సమ్మతి లేకుండా మోసౌల్‌ నగరానికి సమీపానికి చేరుకున్నాయని ఇరాక్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది కాలంగా మోసౌల్‌ నగరం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ఆధీనంలో వుంది. వీరికి వ్యతిరేకంగా పొరాడుతున్న కుర్దిష్‌ పోరాట దళాలకు శిక్షణ ఇవ్వడానికి 150 మంది సైనికులను పంపామని టర్కీ దీనిపై వివరణ ఇచ్చుకుంది. ఇదంతా సర్వసాధారణమైన సైనిక మోహరింపు మాత్రమేనని టర్కీ ప్రధాని ఎహమత్‌ దావుతోగ్లు అన్నారు. ఇరాక్‌తో సైనిక సహకారం కోసమే తాము మోసౌల్‌ నగర సమీపంలో సైనిక క్యాంపును నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే స్థానిక బలగాలకు శిక్షణ అందివ్వడానికే ఈ క్యాంపును ఏర్పాటుచేసినట్టు ఆయన అన్నారు.

Post a Comment

0 Comments