సఫారీ పోరాటం


             
                 స్పిన్నర్ల జోరుతో నాల్గో రోజే లాంఛనం ముగించేలా కనిపించిన భారత్‌ సఫారీ అనూహ్య డిఫెన్స్‌ పోరాటంతో ఒక్కసారిగా పునరాలోచనలో పడింది. 72 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు తీసిన టీమ్‌ ఇండియా.. ఆఖరి రోజు విజయానికి మరో 8 వికెట్ల దూరంలో నిలిచింది. సహనానికే పరీక్షగా నిలుస్తోన్న ఆమ్లా, డివిలియర్స్‌ను పెవిలియన్‌ చేర్చటంపై కోహ్లిసేన గెలుపు ఆధారపడి వుంది. మరి ఆఖరి రోజు ఆటలో సఫారీ సహనమా.. భారత స్పిన్నర్ల జోరా చూడాల్సిందే!!
           ఫిరోజ్‌ షా కోట్ల టెస్టు రసకందాయంలో పడింది. 481 పరుగుల భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా అనూహ్యంగా రక్షణాత్మక వైఖరిని ఆశ్రయించటంతో ఏకపక్షమకున్న మ్యాచ్‌ కాస్త.. ఉత్కంఠగా సాగుతోంది. సఫారీ సారథి హషీమ్‌ ఆమ్లా (23 నాటౌట్‌, 207 బంతుల్లో 3 ఫోర్లు), ఏబీ డివిలియర్స్‌ (11 నాటౌట్‌, 91 బంతుల్లో 1 ఫోర్‌) టీమ్‌ ఇండియా బౌలర్లను తమ డిఫెన్స్‌తో సమర్థవంతగా నిలువరించారు. దీంతో 72 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసిన కోహ్లిసేన కేవలం 2 వికెట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 72/2 స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికా మరో 409 పరుగుల వెనుకంజలో నిలిచింది. స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ (2/29) రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు తొలి సెషన్‌లో బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. అజింక్య రహానే (100, 206 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకం సాధించటంతో 267/5 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ కోహ్లి (88) నాల్గో రోజు ఆరంభంలోనే పెవిలియన్‌ చేరాడు. ఆఖరి రోజు ఆటలో టీమ్‌ ఇండియా విజయానికి 8 వికెట్లు అవసరం కాగా సఫారీలు 90 ఓవర్లు ఆడటంపై దృష్టి పెట్టారు.

                  స్కోరు వివరాలు : 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 334/10
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 121/10
       భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : విజయ్‌ (సి) విలాస్‌ (బి) మోర్కెల్‌ 3, ధావన్‌ (బి) మోర్కెల్‌ 21, రోహిత్‌ (బి) మోర్కెల్‌ 0, పుజార (బి) తాహీర్‌ 28, కోహ్లి (ఎల్‌బి) అబాట్‌ 88, రహానే నాటౌట్‌ 100, సాహా నాటౌట్‌ 23, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (మొత్తం 100.1 ఓవర్లలో 5 వికెట్లకు) 267 డిక్లేర్డ్‌. 
వికెట్ల పతనం : 1-4, 2-8, 3-53, 4-57, 5-211.
బౌలింగ్‌ : మోర్కెల్‌ 3, అబాట్‌ 1, పీట్‌ 0, తాహీర్‌ 1, ఎల్గర్‌ 0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ : ఎల్గర్‌ (సి) రహనే (బి) అశ్విన్‌ 4, బవుమా (బి) అశ్విన్‌ 34, ఆమ్లా బ్యాటింగ్‌ 23, డివిలియర్స్‌ బ్యాటింగ్‌ 11, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం :( 72 ఓవర్లలో 2 వికెట్లకు) 72.
వికెట్ల పతనం : 1-5, 2-49.
బౌలింగ్‌ : ఇషాంత్‌ శర్మ 0, అశ్విన్‌ 2, జడేజా 0, ఉమేశ్‌ యాదవ్‌ 0


Post a Comment

0 Comments