మేరీకామ్‌కు చుక్కెదురు


  • సెమీస్‌లో ఓటమి
  • ఒలింపిక్‌ ట్రయల్‌ ఈవెంట్‌

          ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌, ఇండియన్‌ స్టార్‌ బాక్సర్‌ మేరీకామ్‌కు ఒలింపిక్‌ ట్రయల్‌ ఈవెంట్‌లో చుక్కెదురైంది. భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలి టోర్నీలో పాల్గన్న మేరీకామ్‌.. సెమీఫైనల్స్‌లోనే ఓటమిపాలయ్యింది. వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్‌ నేపథ్యంలో మేరీకామ్‌ తాజా ఓటమి ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాకు చెందిన బాక్సర్‌ వర్గినియా చేతిలో స్వల్ప పాయింట్ల తేడాతో మేరీకామ్‌ ఫైనల్స్‌ బెర్త్‌ కోల్పోయింది. దీంతో కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంచియాన్‌ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మేరీకామ్‌..తర్వాత పాల్గన్న తొలి టోర్నీ ఇదే. పురుషుల విభాగంలోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. కామన్వెల్త్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మనోజ్‌ కుమార్‌ (64 కేజీలు), వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ క్వార్టర్‌ఫైనలిస్ట్‌ సతీశ్‌ కుమార్‌ (91 ప్లస్‌ కేజీలు), ప్రవీణ్‌ కుమార్‌ (91 కేజీలు), శ్యాం కాకర (51 కేజీలు)లు సైతం సెమీఫైనల్స్‌లోనే వెనుదిరిగారు. దీంతో భారత్‌  కాంస్య పతకాలతోనే సంతృప్తి పడాల్సి వచ్చింది. 2016 రియో ఒలింపిక్స్‌ నేపథ్యంలో అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య ' ఒలింపిక్‌ ట్రయల్‌ ఈవెంట్‌' టోర్నీ నిర్వహిస్తోంది.

Post a Comment

0 Comments