థ్రిల్ కోసం పులులపై పైకి...!


మన ఎంజాయ్‌మెంట్‌ కోసం ఏవేవో చేస్తాం... కొంత మంది అందరిలా కాకుండా తాను ఒక డిఫరెంట్‌గా ఉండాలనుకుంటారు... అలాంటీ కోవలోకి వస్తాడు ఈ యువకుడు... చైనాలోని ఓ జూలో అందరూ జంతువులను సందర్శించి సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలో ఓ ఆకతాయి చేసిన విన్యాసం సందర్శకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. రోప్‌వేపై ఛైర్‌లిఫ్ట్‌లో వెళ్తున్న ఆ యువకుడు టక్కున పులి ఉండే ప్రదేశంలో కిందికి దూకేశాడు. దీంతో అక్కడున్న సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. పులుల ఎన్‌క్లోజర్‌పై ఉన్న వలమీద అతడిని చూసి పులి దాడి చేసేందుకు సిద్ధమవ్వడంతో జూ సిబ్బంది అప్రమత్తమై అతడిని రక్షించారు. చివరికి అధికారులకు అతడు ఏం చేప్పాడో తెలుసా... థ్రిల్‌ కోసం అలా చేశానని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు.


Post a Comment

0 Comments