ముల్లా మన్సూర్‌ బతికే వున్నాడా !

             
              అఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్‌ నేత ముల్లా అక్తర్‌ మన్సూర్‌ బతికే ఉన్నట్టు తాలిబాన్లు తాజాగా విడుదల చేసిన ఓ ఆడియో సందేశంలో పేర్కొన్నారు. 16 నిమిషాల నిడివి వున్న ఓ ఆడియోలో మన్సూర్‌ చనిపోయాడన్న విషయం అబద్ధమని, తాలిబాన్లను అణిచివేయడానికే మన్సూర్‌ చనిపోయినట్టు పుకార్లు పుట్టిస్తున్నారని పేర్కొన్నట్టు డాన్‌ పత్రిక రాసింది. తనకి ఎవరితోనూ విభేదాలు లేవని తాను ఆఫ్ఘనిస్తాన్‌లో క్షేమంగానే ఉన్నానని మన్సూర్‌ స్వయంగా చెప్పినట్టు అందులో పేర్కొన్నారు. మన్సూర్‌ చనిపోయాడని చెప్తున్న ప్రాంతానికి తానసలు వెళ్లనే లేదని ఆయన చెప్పారని తాలిబాన్లు పేర్కొన్నారు. మన్సూర్‌ సందేశాన్ని త్వరలో విడుదల చేస్తామన్నారు. మన్సూర్‌ చనిపోయినట్టు ఆఫ్ఘనిస్తాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అధికార ప్రతినిధి సుల్తాన్‌ ఫైజి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విడుదలైన ఆడియో నిజమా ? కాదా ? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు సమాచారం.

Post a Comment

0 Comments