పురుషుడికి గర్భం...

 
సాధారణంగా మహిళలు గర్భం దాల్చుతారు... ఇక్కడ వింత ఏమిటంటే పురుషుడు గర్భం దాల్చి అందరిని ఆశ్చర్యపరచాడు. వివరాల్లోకి వెళ్లితే... పురుషునిగా జన్మించి తను స్త్రీ కావాలనే కోరికతో లింగమార్పిడి చేయించుకున్నాడు. ఇంకేముంది ఇప్పుడు అతడు సారీ తను స్త్రీ కదా!  ఈ సంచలనం చరిత్రలో మొట్టమొదటిసారిగా దక్షిణ అమెరికాలోని పశ్చిమ తీరం ఈక్వెడార్‌లో జరిగింది. పుట్టుకతో స్త్రీ ఉండి లింగమార్పిడి చేయించుకున్న మహిళతో జతకట్టిన ఫెర్నాండో మచాదో తాను గర్భం దాల్చినట్లు ప్రకటించాడు.  ప్రపంచంలో ఈ తరహా ఘటనల్లో ఇదే మొదటిది కావడం ఇక్కడ విశేషం. వీరిద్దరూ పూర్తి స్థాయి లింగ మార్పిడి కోసం హార్మోన్లు తీసుకున్నారని, డెలివరీ సమయంలో ఎలాంటి ప్రమాదం లేదని అక్కడి వైద్య బృందం స్పష్టం చేసింది. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకూ చర్చి లీడర్స్‌ స్పందించలేదు. ఇటీవల అమెరికాలో ట్రాన్స్‌జండర్ల వివాహాలను చట్టబద్దం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ట్రాన్స్‌జండర్లపై వివక్ష కొనసాగుతూనే ఉంది. లాటిన్‌ అమెరికాలో 2008 నుండి 2011 మధ్య కాలంలో 79శాతం ట్రాన్స్‌జండర్లు హత్యకు గురయ్యారు. మొత్తం 664 కేసులు నమోదైనట్లు అంతర్జాతీయ ఎయిడ్స్‌ కూటమి ఓ అధ్యయనంలో పేర్కొంది.Post a Comment

0 Comments