తాగొచ్చిన వరుడు... ఛీ...ఫో అన్న వధువు  • మూడుముళ్ల బంధానికి వధువు నిరాకరణ

పెళ్లి అంటే ఏడడగులబంధం.. నూరేేళ్లు కలిసి జీవించటానికి మూడు ముళ్ల బంధంలో ఓక్కటవుతారు. ఇక పెళ్లి అనగానే వరుడి స్నేహితులు మందుపార్టీలో బిజీఅయిపోవటం చూస్తుంటాం. కానీ తాళికట్టే వరుడే తాగివస్తే.. కొందరు తలవంచితే.. ఆ వధువు మాత్రం పెగ్గేసుకొచ్చి మండపానికి వచ్చిన ఆ వరుడితో పెళ్లికి నో చెప్పేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీప గ్రామం సిఘౌల్‌లో దానిని పోలిన ఈ ఘటనే బుధవారం చోటుచేసుకుంది. ఇటీవల చదువుకున్నాడని అబద్ధం చెప్పి పెళ్లికి రెడీ అయిన ప్రబుద్ధుడిని ఓ యువతి తిరస్కరించిన ఘటనను మరువకుముందు... 'పెళ్లి రద్దుకావడంతో పోలీసు జోక్యం లేకుండానే రెండు వైపుల వారూ రాజీ కుదుర్చుకున్నారు... అసలేం జరిగిందంటే.. వరుడి పేరు సురేంద్ర తివారీ... వధువు సజేతీ... పెళ్లి బారాత్‌ సిద్ధమైంది.. ఓ పెగ్గు వేసుకుంటే ఏమవుతుందిలే అనుకున్నాడేమో... ఏమో కానీ పెళ్ల్లిి కొడుకు మందు కొట్టి ... సరాసరి మండపానికి వచ్చాడు వరుడు...మందుకొట్టి వచ్చిన వరుడిని కాబోయే  పెళ్ల్లి కూతురు వాసన పసిగట్టింది... ఏముంది కట్‌చేస్తే పెళ్ల్లిికి నో అనేసింది పెళ్లి కూతురు.. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదిద్దామని వచ్చిన బంధుమిత్రులు... అమ్మాయి ధైర్యసాహసాలను అభినందించి వెనుదిరిగి వెళ్ళారు... ఏది ఏమైనా ఆ మందు అలవాటే పెళ్లిని పెటాకులు చేసిందని వరుడి తల్లిదండ్రులు తెగబాధపడిపోయారు.


Post a Comment

0 Comments