ప్రాణాన్ని మింగిన సెల్ఫీ


నేటి ఆధునిక ప్రపంచంలో సెల్ఫీలకు యమక్రేజీ నానాటికీ పెరిగిపోతుందనడంలో అనుమానం లేదు.. కానీ యువత సెల్ఫీ క్రేజీలతో తమ ప్రాణాలను సైతం కోల్పోవడం చాలా బాధాకరం. సెల్ఫీలతో ఎంత ఎంజాయ్‌మెంట్‌ ఉంటుందో.. అంతే ప్రాణాలను కూడా ముప్పు ఉందన్న విషయాన్ని యువతీ, యువకులు గ్రహించాల్సి అవసరం ఎంతైన ఉంది. సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రాణాలను కోల్పోయిన ఓ యువకుడి ఘటన చదవండి... వివరాల్లోకి వెళ్లితే పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతానికి చెందిన జంషేద్‌ఖాన్‌ రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. రైలు కదులుతున్న సమయంలో పట్టాలపై నిల్చుని సెల్ఫి తీసుకోవాలని తన ఆలోచన మృత్యువు ఒడిలోకి చేరింది. రైలు నెమ్మదిగా వస్తుందని ఊహించి పట్టాలపై నిల్చుని సెల్ఫీ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన రైలు తనపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతుడి తండ్రి పర్వేజ్‌కు విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.


Post a Comment

0 Comments