ఫ్లూటో...రంగుల చిత్రం


    అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఫ్లూటో కలర్‌ ఫొటోను విడుదల చేసింది. నాసాకు చెందిన న్యూహారిజన్స్‌ అంతరిక్ష నౌక ద్వారా తీసిన చిత్రాలలో అతి సమీపంగా ఉన్న ఓ కలర్‌ ఫొటోను నాసా విడుదల చేసింది. న్యూహారిజన్స్‌ ఈ ఫొటోను జులై 14న తీసింది. తక్కువ రిజాల్యూషన్‌ కలర్‌ డేటా ఆధారంగా ఈ ఫొటోను తీశారు. జులైలో న్యూహారిజన్స్‌ ఫ్లూటోకు అతి దగ్గరగా వెళ్లినప్పుడు తీసిన ఫొటోలను ఇటీవల నాసా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కలర్‌లో తీసిన ఫొటోను విడుదల చేసింది.


Post a Comment

0 Comments