జేఎన్‌యు ప్రొఫెసర్‌ లైంగిక వేధింపు


ఢిల్లీలోని జవహర్‌ లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న బంగ్లాదేశ్‌ యువతిని ఓ ప్రొఫెసర్‌ లైంగికంగా వేధించాడు. అతడిని విధుల్లో నుంచి సోమవారం తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రీసెర్చ్‌లో పీహెచ్‌డీ చేయటానికి బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన యువతిపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కన్నుపడింది. అతని వేధింపులకు తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ కమిటీని నియమించారు. ప్రొఫెసర్‌  ఆగడాలు నిజమేనని గుర్తించిన కమిటీ నివేదిక సమర్పించింది. అతన్ని విధుల నుంచి తొలగించినట్టు ప్రకటించారు.

Post a Comment

0 Comments