తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో...  • అండర్‌19 వరల్డ్‌కప్‌

           వచ్చే ఏడాది జనవరిలో బంగ్లాదేశ్‌లో జరిగే అండర్‌ా19 వరల్డ్‌ కప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. సోమవారం ఢాకాలో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రెసిడెంట్‌ నజ్ముల్‌ హసన్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, నేపాల్‌ జట్లు గ్రూప్‌ాడిలో ఉన్నాయి. ఐసిసి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మెగాటోర్నమెంట్‌ బంగ్లాదేశ్‌లో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరుగుతుంది. మొత్తం 48 మ్యాచుల్లో తొలిసారిగా ఐసిసి 20 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అండర్‌ా19 వరల్డ్‌కప్‌ను భారత్‌ ఇంతకుముందు 2000, 2008, 2012లో గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కరతో పాటు బంగ్లాదేశ్‌ క్రికెటర్లు టస్కిన్‌ అహ్మద్‌, ముస్తఫిజుర్‌ రహ్మాన్‌ ముఖ్య అతిథులుగా పాల్గన్నారు.

Post a Comment

0 Comments