జుకర్‌బర్గ్‌ బుల్లి మ్యాక్స్‌తో...


           ఫేస్‌బుక్‌ సహా వ్యవస్థాపకుడు, సీఈఓ అయినా మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇప్పుడు తండ్రి హోదాని  పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నారు. తన ముద్దుల కూతురు మ్యాక్స్‌ని పక్కన పడుకోబెట్టుకుని ఆమెవైపు ప్రేమగా చూస్తూ దిగిన ఫొటోని తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. 'బుల్లి మ్యాక్స్‌తో సంతోషంగా' అంటూ ఆ ఫోటోకి కామెంట్‌ పెట్టారు. ఈ చిత్రాన్ని ఫోస్ట్‌ చేసి ఒక్క రోజు కూడా గడవక ముందే ఏకంగా 22 లక్షలకు పైగా లైకుల వర్షం కురిసింది. 18,000 మందికి పైగా  దాన్ని షేర్‌ చేశారు. జూకర్‌బర్గ్‌, ప్రిసిల్లా దంపతులకు ఇటీవలే మ్యాక్స్‌ పుట్టిన విషయం తెలిసిందే. దీంతో జూకర్‌బర్గ్‌ నాలుగు నెలల పాటు పెటర్నిటీ సెలవు తీసుకుని తన గారాల పట్టితో సరదాగా గడుపుతున్నారు. ఆమె పుట్టిన సందర్భంగా తన కుటుంబ షేర్లలో 99 శాతం వాటాని బాలల సంక్షేమం నిమిత్తం చారిటీకి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించింన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments