ఐఎస్‌ అంతానికి అణ్వస్త్రాలవసరం లేదు : పుతిన్‌

                       సిరియా, ఇరాక్‌ ప్రాంతాలలో మారణకాండ కొనసాగిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల భరతం పట్టటానికి అణ్వస్త్రాలు అవసరం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అభిప్రాయపడ్డారు.  సముద్ర ఉపరితలం నుండి సిరియాలోని ఉగ్రవాదులపైకి ప్రయోగిస్తున్న క్రూయిజ్‌ క్షిపణుల సామర్ధ్యాన్ని ఆయన కొనియాడుతూ వీటికి న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ అమర్చాల్సిన అవసరం వుండదన్నారు.  అణ్వస్త్ర ప్రయోగావసరం రాకూడదనే తాను కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇస్లామిక్‌ స్టేట్‌పై తాము చేపట్టిన దాడులపై తాజా పరిస్థితులను సమీక్షించిన అనంతరం పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం.


Post a Comment

0 Comments