డోపింగ్‌లో కుశాల్‌ స్టంప్‌ అవుట్‌


  • శ్రీలంక క్రికెటర్‌ కుశాల్‌ పెరీరాపై నాలుగేళ్ల నిషేధం
డోపింగ్‌కు పాల్పడ్డారంటే... వాళ్లు అథ్లెటిక్స్‌ ఆటగాళ్లు అనుకునే రోజులు పోయాయి... ట్రెండ్‌ మారింది ఇప్పుడు... క్రికెటర్లు సైతం నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతూ డోపింగ్‌ టెస్టుల్లో దొరికిపోవడం క్రికెట్‌ అభిమానుల మనసులను కలవరపరుస్తున్నాయి... తాజాగా శ్రీలంక వికెట్‌ కీపర్‌, ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌ అయిన కుశాల్‌ పెరీరాపై నాలుగేళ్ల పాటు క్రికెట్‌ ఆడవద్దంటూ నిషేధించారు.  అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిర్వహించిన డోపింగ్‌ టెస్టులో అతని యూరిన్‌ శాంపిల్స్‌ పాజిటివ్‌గా రావడంతో కుశాల్‌ పెరీరాను  నాలుగేళ్ల పాటు నిషేదిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ విషయంపై శ్రీలంక క్రీడాశాఖ మంత్రి దయాసిరి జయశేఖర మాట్లాడుతూ, కుశాల్‌ పెరీరా నిషేధంపై అప్పీలు చేస్తామని తెలిపారు. కాగా గతంలో మరో శ్రీలంక క్రికెటర్‌ ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ కూడా ఇలాంటి డోపింగ్‌లో పట్టుబడి 3నెలల పాటు నిషేధానికి గురయ్యాడు....




Post a Comment

0 Comments