రేపు ఒంగోలులో సౌఖ్యం ఆడియో


        ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియంలో సౌఖ్యం ఆడియో వేడుకలు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ చిత్రం సహ నిర్మాత జె వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక హోటల్‌ కోలాస్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవ్య క్రియేషన్‌ బ్యానర్‌పై గోపీచంద్‌, రెజీనా జంటగా ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. నిర్మాత వి ఆనంద్‌కుమార్‌, దర్శకులు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరిగా చిత్రం నిర్మితమైందన్నారు. గోపీచంద్‌ ప్రకాశం జిల్లాకు చెందటం, చిత్ర కథానాయిక రెజీనా జన్మదినోత్సవం అదే రోజు కావటంతో ఒంగోలులో ఆడియో విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సభలో రష్యాకు చెందిన ఓ బృందం ఈలియం బెలూన్‌తో చేసే సాహసాలు హైలెట్‌గా నిలుస్తాయన్నారు. సౌఖ్యం ఆడియోను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధనరావు, జిల్లా ఎస్పీ సిహెచ్‌ శ్రీకాంత్‌ ప్రారంభిస్తారని, ప్రముఖ హాస్యనటులు బ్రహ్మనందం, రఘుబాబు పాల్గొంటారన్నారు.

Post a Comment

0 Comments