నైజీరియాలో ఘోరం...  • 100 మంది మృత్యువాత
ప్రమాదవశాత్తు గ్యాస్‌ ట్యాంకర్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో 100 మంది మృత్యువాత పడిన ఘటన నైజీరియాలోని నేవీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి....  శుక్రవారం నాడు గ్యాస్‌ ట్యాంకర్‌ నుంచి ఖాళీగా ఉన్న సిలిండర్లలోకి గ్యాస్‌ను నింపుతున్న సమయంలో మంటలు లేచాయి.. అలా మంటలు పెద్దవి కావటంతో గ్యాస్‌ ట్యాంకర్‌ పేలింది. దీంతో అక్కడ చుట్టుప్రక్కల ఉన్న జనాలకు మంటలు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారాన్ని అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు సుమారు 100 మంది మృతి చెందారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మరికొంత మంది క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స నిర్వహిస్తున్నారు.  ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.


Post a Comment

0 Comments