ముజఫర్‌నగర్‌లో మరో దారుణం  • విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అఘాయిత్యం

           ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణ ఘటన జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థిని (12)పై పాఠశాలలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గురువారం ఈ ఘటన జరగగా, ఉపాధ్యాయుడు బ్రిజేందర్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 376 (అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపు) తదితర అభియోగాలను మోపారు. స్కూలు అయిపోయిన తర్వాత బాలికను ఉపాధ్యాయుడు నిర్బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదించాడని తెలిపారు. భయపడుతూ ఇంటికి వచ్చిన ఆమె తల్లిదండ్రులకు జరిగిన ఘటన చెప్పడంతో స్థానికుల సహాయంతో వారు ఉపాధ్యాయుడి నివాసాన్ని ముట్టడించారు. అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.Post a Comment

0 Comments