సెమీస్‌లో భారత్‌హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్‌

           వీఆర్‌ రఘునాథ్‌, తల్వీందర్‌ సింగ్‌ చెరో గోల్‌ కొట్టడంతో హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్లో భారత్‌ సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 2ా1 తేడాతో గ్రేట్‌ బ్రిటన్‌ను ఓడించింది. రఘునాథ్‌ 19వ నిమిషంలో, తల్వీందర్‌ సింగ్‌ 39వ నిమిషంలో గోల్స్‌ కొట్టి భారత్‌కు ఆధిక్యం అందించారు. మొదటి పెనాల్టీ అవకాశాన్నే భారత్‌ సొమ్ము చేసుకుంది. అమీర్‌ ఖాన్‌ కొట్టిన పెనాల్టీ షాట్‌ను సర్దార్‌సింగ్‌ నేర్పుగా రఘునాథ్‌కు అందించాడు. రఘునాథ్‌ వేగంగా బంతిని గోల్‌ పోస్ట్‌లోకి కొట్టి భారత్‌కు 1ా0 ఆధిక్యం అందించాడు. ప్రపంచ ఐదో ర్యాంకరైన బ్రిటన్‌కు పలు అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మ్యాచ్‌లో పి.శ్రీజిత్‌ గోడలా పనిచేసి బ్రిటన్‌ ఆటగాళ్ల దాడులను సమర్థమంతంగా అడ్డుకున్నాడు.

Post a Comment

0 Comments