నలుగురు చిన్నారులను హతమార్చిన కన్న తండ్రి

                 భార్యతో గొడవ పడి తన నలుగురు చిన్నారుల్ని కన్న తండ్రే హతమార్చిన ఘటన రాజస్తాన్‌లో జరిగింది. చురు జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గులాబ్‌ ఖాన్‌ అనే వ్యక్తి తన భార్యతో గొడవ పడగా, ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో, కోపోద్రిక్తుడైన ఖాన్‌ ఇంట్లో ఉన్న తన నలుగురు చిన్నారుల్ని కత్తితో గొంతులు కోసి చంపేశాడు. వారిలో ముగ్గురు 8,6,4 ఏండ్ల వయసున్న మైనర్‌ బాలికలు కాగా, ఒకరు రెండేళ్ల పసి బాలుడు. హత్యాకాండ అనంతరం ఖాన్‌ ఇంటి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments